Spirit: స్పిరిట్ రికమండేషన్ల పరిస్థితేంటి?
ప్రభాస్(prabhas), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కనున్న స్పిరిట్(Spirit) మూవీ పై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో అవకాశం ఇస్తే నటించడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. సందీప్ దర్శకత్వంలో చిన్న రోల్ చేయడానికి అయినా చాలా మంది రెడీ అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చేయడానికి సెలబ్రిటీలు సైతం వెయిట్ చేస్తున్నారు.
మంచు విష్ణు(manchu vishnu) సైతం అలాంటి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. స్పిరిట్ మూవీలో చిన్న అవకాశమొచ్చినా చేస్తానంటున్నాడు విష్ణు. డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) కూడా యాక్టింగ్ చేస్తే సందీప్ దర్శకత్వంలోనే చేయాలని ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా మంచు విష్ణు, అనిల్ రావిపూడి లాగా చాలా మంది స్పిరిట్ లో నటించాలని సందీప్ ను అడుగుతూనే ఉన్నారు.
కానీ సందీప్ దగ్గర ఎలాంటి రిక్వెస్టులు, రికమండేషన్లు పనికి రావనే సంగతి తెలిసిందే. తాను రాసుకున్న పాత్రకు ఎవరైతే సరిగ్గా సరిపోతారో వాళ్లనే తీసుకుంటాడు తప్పించి క్యాస్టింగ్ విషయంలో అస్సలు రాజీ పడడు సందీప్. ఈ నేపథ్యంలో మరి స్పిరిట్ లో నటించాలని ఆసక్తి చూపిస్తున్న సెలబ్రిటీల ఇంట్రెస్ట్లను సందీప్ ఏ మాత్రం లెక్క లోకి తీసుకుంటాడో చూడాలి.






