సురేందర్ రెడ్డి పరిస్థితేంటి?
అతనొక్కడే సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సురేందర్ రెడ్డి మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. తర్వాత ఎన్టీఆర్ తో అశోక్, ఊసరవెల్లి సినిమాలు చేశాడు. ఆ తర్వాత రవితేజ తో చేసిన కిక్ సినిమా అతనికి మంచి హిట్ ను అందించింది. దానికి సీక్వెల్ గా చేసిన కిక్2 మాత్రం డిజాస్టర్ అయింది.
రామ్ చరణ్ తో ధృవ సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్న సురేందర్ రెడ్డి తర్వాత మెగాస్టార్ తో సైరా నరసింహా రెడ్డి చేసి ఓకే అనిపించుకున్నాడు. సైరా తర్వాత ఎవరూ ఛాన్సులు ఇవ్వకపోవడంతో అక్కినేని అఖిల్ తో ఏజెంట్ అనే సినిమాను తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ గా మిగిలింది.
ఏజెంట్ తో ఫామ్ లోకి వస్తాడనుకున్న సురేందర్ రెడ్డి ఆ సినిమాతో మరో ఫ్లాప్ ను అందుకున్నాడు. ఫలితంగా ఆయనతో సినిమాలు చేసేందుకు ఏ హీరో సాహసం చేయడం లేదు. కానీ సూరి డైరెక్షన్ లో సినిమా చేసేందుకు పవన్ ఒప్పుకున్నాడని టాక్ వినిపించింది. సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఎప్పుడు మొదలవుతుంది ఏంటనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం పవన్ మొదలుపెట్టిన సినిమాలనే పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసి రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అలాంటిది కనీసం ఇంకా మొదలు కూడా పెట్టని సురేందర్ రెడ్డి సినిమా గురించి ఎప్పుడు ఆలోచిస్తాడన్నది ప్రశ్నగానే మిగిలేట్లు కనిపిస్తోంది. మరి సురేందర్ రెడ్డి పవన్ కోసం ఎంత టైమ్ అయినా వెయిట్ చేస్తాడా లేదా మరో హీరోతో ఏమైనా ముందుకు వెళ్తాడా అన్నది చూడాలి.













