Kiara: కియారా ప్లానేంటో మరి
బాలీవుడ్ నటి కియారా అద్వానీ(Kiara Advani) త్వరలో తల్లి కాబోతున్న విషయాన్ని రీసెంట్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కియారా- సిద్దార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) జంటకు కంగ్రాట్యులేషన్స్ చెప్తూ విష్ చేస్తున్నారు. కియారా కు ఆరోగ్య నియమాలు చెప్తూ కొందరు జాగ్రత్తలు చెప్తున్నారు.
కానీ మరికొందరు మాత్రం ఆమె తర్వాతి సినిమాల పరిస్థితేంటని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి చేతిలో యష్(Yash) టాక్సిక్(Toxic)తో పాటూ, హృతిక్(Hrithik) వార్2(War2) కూడా ఉన్నాయి. ఈ రెండూ ప్రస్తుతం షూటింగ్ లోనే ఉన్నాయి. వార్2 లో కియారా పోర్షన్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయుండొచ్చు. కానీ టాక్సిక్ షూటింగ్ మాత్రం ఇంకా సగంలోనే ఉంది.
మరి కియారా టాక్సిక్ షూటింగ్ ను ఎలా ఫినిష్ చేస్తుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. రానున్న రెండు నెలల్లోనే కియారా టాక్సిక్ లో తన పోర్షన్ షూటింగ్ ను ఫినిష్ చేయాల్సి ఉంది. తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల వీలు పడదు కాబట్టి ఈలోపు పెండింగ్ షూటింగ్ ను కియారా పూర్తి చేసేస్తే బెటర్. టాక్సిక్ విషయంలో కియారా ప్లానింగ్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.













