పవన్ ప్లాన్స్ ఏంటసలు?
రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ను ఓ ఆరు నెలల క్రితం వరకు పవర్ స్టార్ అనే పిలిచేవాళ్లు. కానీ ఆరు నెలల నుంచి అందరూ ఆయన్ను పవర్ స్టార్ అని కాకుండా జనసేనాని అంటూ వస్తున్నారు. ఇక ఎలక్షన్స్ తర్వాత అయితే పవన్ ను ఎమ్మెల్యే అని సంబోధించారు. కానీ ఇప్పుడు ఆయన తాజాగా డిప్యూటీ సీఎం అయిపోయాడు.
దీంతో ఆయనపై ఎంతో బాధ్యత వచ్చి పడింది. ఏపీ రాజకీయాల్లో పవన్ తనదైన ముద్ర వేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే పవన్ కు ఇప్పుడు ఓ ఇబ్బంది ఎదురైంది. ఆయన ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు మూడు సెట్స్ పై ఉన్నాయి. ఓ వైపు ఏపీ భవిష్యత్తు కూడా తన చేతిలో ఉంది. సినమాలను వదిలేద్దామన్నా పవన్ ఇప్పటికప్పుడు ఆ పని చేయలేడు.
కనీసం కమిట్ అయిన సినిమాలనైనా పూర్తి చేయాల్సిందే. దాని కోసం పవన్ ఎప్పుడు ఎలా తన టైమ్ ను కేటాయించనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం పవన్ ఒకేసారి కాకుండా వచ్చే రెండేళ్లలో తనకు కుదిరినప్పుడల్లా ఆయా సినిమాలకు కాల్షీట్స్ ఇస్తూ, ఆ మూడు సినిమాలను పూర్తి చేయనున్నాడని తెలుస్తోంది. మొదటిగా హరిహర వీరమల్లును పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నాడట. దాన్ని పూర్తి చేశాకే మరో సినిమా గురించి ఆలోచించనున్నాడట పవన్.













