War2: తారక్‌తో పోటీకి రెడీ అవుతున్న హృతిక్
ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్లలో ఒకటిగా చెప్పుకుంటున్న వార్2(war2) రిలీజ్ మరో 8 నెలల్లో ఉంది. ఆగస్ట్ 14న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ఆల్మోస్ట్ పూర్తైంది. కొంచెం ప్యాచ్ వర్క్, సాంగ్ తప్ప అంతా పూర్తైందని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే వార్2లో తారక్(Tarak), హృతిక్(Hrithik) కాంబోలో ఓ సాంగ్ ఉంటుంది.
ఆ సాంగ్ డ్యాన్స్ నెంబర్. ఆర్ఆర్ఆర్(RRR) ని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన నాటు నాటు(Naatu Naatu) సాంగ్ ను మించి ఈ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే ఈ సాంగ్ తనకు ఎంత ఛాలెంజింగ్ గా ఉందనేది హృతిక్ రీసెంట్ గా ఓ చోట వెల్లడించాడు. కహో నా ప్యార్ హై(Kaho Na Pyar Hi) మూవీ రీరిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ తో జరిపిన చిట్ చాట్ లో హృతిక్ ఈ విషయం గురించి వెల్లడించాడు.
హృతిక్ చెప్పిన ప్రకారం వార్2లో ఓ పెద్ద డ్యాన్స్ సాంగ్ కోసం రెడీ అవుతున్నాడు. తన కాళ్లు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నానని, ఆ పోటీలో నిలబడటానికి సంసిద్ధమవుతున్నట్లు చెప్పడంతో ఆ సాంగ్ పై అందరి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బాలీవుడ్ లోనే బెస్ట్ డ్యాన్సర్ గా పేరున్న హృతిక్ ఇంతలా చెప్పాడంటే కొరియోగ్రఫీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని అర్థమవుతుంది. అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది.













