War2: వార్2 లేటెస్ట్ అప్డేట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం వార్2(War2) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ మూవీతోనే మొదటిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం వల్ల ఈ మూవీపై దేశ వ్యాప్తంగా అందరికీ భారీ అంచనాలున్నాయి. అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.
అయితే వార్2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తో నెక్ట్స్ లెవెల్ డ్యాన్స్ నెంబర్ ను ప్లాన్ చేశాడని సినిమా మొదలైనప్పటి నుంచే వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి నెలాఖరులో ఆ సాంగ్ ను షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సినిమాలోని యాక్షన్ సీన్స్ ఆల్మోస్ట్ పూర్తి చేసిన వార్2 టీమ్ ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చింది. ఈ నెలాఖరున తర్వాతి షెడ్యూల్ ను మొదలుపెట్టి ఆ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చెంట్(Vaibhavi Merchant) ఈ సాంగ్ ను కొరియోగ్రఫీ చేయనున్నారట. హృతిక్ తారక్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు కావడంతో వీరిద్దరి కలయికలో వచ్చే పాట ఎలా ఉంటుందా అని చూడ్డానికి ఆడియన్స్ చాలా ఎగ్జయింట్ గా ఫీలవుతున్నారు. దానికి తోడు ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నా అని స్వయంగా హృతిక్ ఓ సందర్భంలో చెప్పడంతో అప్పటివరకు ఆ సాంగ్‌పై ఉన్న అంచనాలు ఇంకా పెరిగాయి. ఆగస్ట్ 15న వార్2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













