సమరం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన వి.వి.వినాయక్
సాగర్ గంథం హీరోగా ప్రగత్య నయన్ హీరోయిన్గా సుమన్, వినోద్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం సమరం. జననీ క్రియేషన్స్ బ్యానర్‌పై అలూరి దర్శకత్వంలో శ్రీనివాస్ వీరంశెట్టి, పి.లక్ష్మణాచారి సంయుక్తంగా తెలుగు, కన్నడ భాషల్లో సమరం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టైటిల్ చాలా బాగుందని, పోస్టర్లు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నారు. డైరెక్టర్ బషీర్ చెప్పిన కాన్సెప్ట్ కొత్తగా ఉందన్నారు. డెఫనెట్‌గా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని, సినిమా మంచి హిట్ అయి సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. హీరో సాగర్ మాట్లాడుతూ తెలుగులో ఇది మూడవ చిత్రమని, యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో దర్శకుడు బషీర్ అలూరి, నిర్మాతలు శ్రీనివాస్ వీరంశెట్టి, పోకూరి లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు.













