Viswambhara: విశ్వంభర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడంటే
భోళా శంకర్(Bhola Shankar) డిజాస్టర్ తర్వాత చిరంజీవి(Chiranjeevi) కథల ఎంపికలో బాగా టైమ్ తీసుకుని తర్వాతి సినిమాను బింబిసార(Bimbisara) ఫేమ్ వశిష్ట(Vasishta)తో విశ్వంభర(Viswambhara) చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations) భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. విశ్వంభరపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
వాస్తవానికి విశ్వంభర ఎప్పుడో రిలీజ్ అవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ గురించి సోషల్ మీడియాలో అప్డేట్ వినిపిస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 12న విశ్వంభర నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఈ పాటను నందిగామలోని పరిటాల ఆంజనేయ స్వామి గుడి దగ్గర రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట. ఆస్కార్ విజేత కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, ఆడియన్స్ కు పాటలన్నీ తప్పకుండా నచ్చుతాయని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ట చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి విశ్వంభర ఫస్ట్ లిరికల్ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.













