Viswambhara: విశ్వంభర ఫస్ట్ సింగిల్ అప్డేట్
చిరంజీవి(Chiranjeevi) హీరోగా యంగ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం విశ్వంభర(Viswambhara). సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్, వీఎఫ్ఎక్స్ వర్క్స్ భారీగా పెండింగ్ ఉండటం వల్ల మూవీ పోస్ట్‌పోన్ అయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓ వైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆడియో వర్క్స్ ను కూడా విశ్వంభర జరుపుకుంటుంది. రీసెంట్ గా విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ సినిమాకు కీరవాణి(Keeravani) ఇచ్చిన మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని డైరెక్టర్ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
వశిష్ట అప్డేట్ తర్వాత విశ్వంభర మ్యూజిక్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ గురించి ఓ న్యూస్ వినిపిస్తోంది. విశ్వంభర ఫస్ట్ సింగిల్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని, శివరాత్రి ఆ సాంగ్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చాలా కాలం తర్వాత చిరూ, కీరవాణి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్ లో ఎలాంటి ఆల్బమ్ వస్తుందోనని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.













