Vikram: ఆ విషయంలో ఎంతో బాధపడ్డా!
హీరో విక్రమ్(Vikram) వరుస పెట్టి సినిమాలైతే చేస్తున్నాడు కానీ అవి అనుకోని కారణాల వల్ల వాయిదాలు పడుతూ అతని మార్కెట్ ను దెబ్బతీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విక్రమ్ హీరోగా వీరధీర శూరన్ పార్ట్2(Veera Dheera Sooran2) రిలీజైన విషయం తెలిసిందే. అరుణ్ కుమార్(Arun Kumar)దర్శకత్వంలో హెచ్ఆర్ పిక్చర్స్(HR pictures) సంస్థలో రియా శింబు(Rhea Simbhu) నిర్మించిన ఈ మూవీలో దుషార(Dushara) హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా రిలీజ్ కు ముందు న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తానికి సమస్యను సాల్వ్ చేసుకుని ఆ సినిమా రిలీజై మంచి టాక్ తో దూసుకెళ్తుంది. వీర ధీర శూరన్2 సక్సెస్ పై సంతోషంగా ఉన్న విక్రమ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో విక్రమ్ ఎమోషనల్ గా మాట్లాడారు.
వీర ధీర శూరన్2 సినిమా తనకెంతో స్పెషల్ అని, రిలీజ్ కు ముందే ఆ సినిమా కొంతమందికి చూపించగా, మూవీ చూసిన వాళ్లంతా సినిమా ఈ ఇయర్ బెస్ట మూవీస్ లో ఒకటిగా ఉంటుందని చెప్పడంతో సినిమాపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందని, కానీ రిలీజ్ ముందు సినిమాకు లీగల్ ఇష్యూస్ రావడం, నాలుగు వారాల పాటూ సినిమాను వాయిదా వేయాలని చెప్పడంతో ఆ టైమ్ లో ఏం చేయాలో అర్థం కాక ఎంతో బాధ పడ్డానని విక్రమ్ ఎమోషనల్ అయ్యారు. ఎలాగైనా ఈ సినిమాను బయటకు తీసుకొచ్చి ఫ్యాన్స్ కు చూపించాలని శ్రమపడ్డామని, రిలీజ్ తర్వాత ఆడియన్స్ తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందించారని దానికి ఎంతగానో కృతజ్ఞుడిని అని మాట్లాడుతూ విక్రమ్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
https://x.com/itisprashanth/













