ఖుషి తర్వాత విజయ్ సినిమా ఎవరితో?
లైగర్ సెట్స్‌పై ఉన్నప్పుడే సుకుమార్ డైరెక్షన్లో సినిమా అనౌన్స్ చేశాడు విజయ్. అయితే పుష్ప రెండు పార్టులుగా ప్లాన్ చేయడంతో లెక్కలన్నీ మారిపోయి, శివ నిర్వాణతో ఖుషిని అనౌన్స్ చేశాడు. అంతేకాదు పూరీ డైరెక్షన్లో జనగణమన అనే పాన్ ఇండియన్ మూవీని స్టార్ట్ చేశారు.
ఇదంతా చూసి అందరూ విజయ్ తన కెరీర్‌ను భలే ప్లాన్ చేసుకున్నాడే అనుకున్నారంతా. కానీ లైగర్ రిజల్ట్‌తో లెక్కలన్నీ మారాయి. ఖుషి తర్వాత విజయ్ చేయబోయే సినిమా ఏంటనేది అంతుపట్టకుండా పోయింది. జనగణమన క్యాన్సిల్ అయింది. సుకుమార్‌తో సినిమా అంటే ఎంతకాదన్నా రెండేళ్లు పడుతుంది.
అందుకే ఈ గ్యాప్‌లో విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టడానికి హరీష్ శంకర్‌తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్లో హరీష్ శంకర్ లేదా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో విజయ్ నెక్ట్స్ ప్రాజెక్టు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఏ విషయం స్పష్టత రావాల్సి ఉంది.













