Vijay Sethupathi: అజిత్ తో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా: సేతుపతి
గతేడాది మహారాజా(Maharaja)తో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి(Vijay sethupathi), ఆ తర్వాత విడుదలై-2(vidudhalai-2)తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ మూవీతో తమిళనాడులో మంచి హిట్టే అందుకున్నాడు. కానీ తెలుగులో మాత్రం విడుదల2కి అనుకున్నంతగా ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం సేతుపతి ఏస్(Ace), ట్రైన్(train) అనే రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి.
రీసెంట్ గా సేతుపతి ఓ కాలేజ్ ఫంక్షన్కు ముఖ్య అతిధిగా హాజరై పలు ముఖ్య విషయాలను విద్యార్థులకు సూచించాడు. సోషల్ మీడియాతో అందరూ జాగ్రత్తగా ఉండాలని, చూసిన ప్రతీ దాన్నీ నమ్మొద్దని, మీ మనసుని టార్గెట్ గా చేసుకుని అనవసరమైన కంటెంట్ ను అందులో పోస్ట్ చేస్తారని, తెలివిగా ఆలోచించి ముందడుగు వేయాలని విద్యార్థులకు సలహా ఇచ్చాడు సేతుపతి.
టైమ్ ఎంతో విలువైనదని, అది గడిచిన తర్వాత మాత్రమే మనకు దాని విలువ తెలుస్తోందని, అందుకే కుదిరినంత వరకు టైమ్ను సద్వినియోగం చేసుకోమని సూచించిన సేతుపతి, సంతోషంగా జీవితాన్ని గడపమని విద్యార్థులకు తెలిపాడు. ఈ సందర్భంగా అజిత్ గురించి సేతుపతి మాట్లాడాడు. అజిత్(Ajith)చాలా మంచి వ్యక్తి అని, గతంలో తామిద్దరూ కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నాని చెప్పాడు. ఇక తన కెరీర్లో ఇప్పటివరకు ఏదీ ప్లాన్ చేసుకోలేదని, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లడం మాత్రమే తనకు తెలుసని సేతుపతి తెలిపాడు.













