మరో సెన్సేషనల్ మూవీతో సేతుపతి
విజయ్ సేతుపతి గొప్ప నటుడనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన సోలో హీరోగా చేసిన సినిమాల్లో హిట్ అయినవి తక్కువ. ఒక దశలో సోలో హీరోగా వరుస ఫ్లాపులు రావడంతో సేతుపతి అవి చేయడం మానేశాడు. విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే స్క్రీన్ పై కనిపించాడు. కానీ తన కెరీర్లో 50వ సినిమా మైల్ స్టోన్ గా నిలవాలనే ఉద్దేశంతో సోలో హీరోగా మహారాజా అనే సినిమా చేశాడు.
అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీలో ఈ సినిమా మరింత సెన్సేషన్ అయింద. నెట్ఫ్లిక్స్ లో ఈ ఇయర్ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ మూవీగా మహారాజా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ తో సేతుపతి ఇప్పుడు సోలో హీరోగా ట్రైన్ అనే మరో సెన్సేషనల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
కోలీవుడ్ లో విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే మిస్కిన్ ఈ సినిమాకు దర్శకుడు. చిత్తిరం పేసిదడి, అంజాదే, యుద్ధం సెయ్, నందలాల, సైకో, తుప్పరివాలన్, పిశాచి లాంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న మిస్కిన్ ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను తీస్తూ ఆడియన్స్ కు ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంటాడు. ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్, సేతుపతి లాంటి గొప్ప నటుడితో సినిమా చేస్తుండటం అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ట్రైన్ సినిమా కోసం సేతుపతి ఓ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సేతుపతి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













