Rowdy Janardhana: ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో “రౌడీ జనార్థన” – దిల్ రాజు
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ “రౌడీ జనార్థన”. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రౌడీ జనార్థన” సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్ మాట్లాడుతూ – డైరెక్టర్ రవికిరణ్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యాడు. ఆయనను మొదటిసారి కలిసినప్పుడే ఎంత పెద్ద విజన్ తో ఉన్నాడు అనేది అర్థమైంది. ఇప్పుడు మీరు చూసిన టైటిల్ గ్లింప్స్ చిన్న శాంపిల్ మాత్రమే. ఇంకా ఎగ్జైటింగ్ కంటెంట్ రాబోతోంది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
డీవోపీ ఆనంద్ సి చంద్రన్ మాట్లాడుతూ – రౌడీ ఫ్యామిలీ అందరికీ హాయ్. మీకు రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ మూవీ నుంచి ఇంకా చాలా సర్ ప్రైజింగ్ కంటెంట్ రాబోతోంది. త్వరలోనే ఆ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ – మీ అందరి లాగే నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానిని. నేను అభిమానించే కీర్తి సురేష్, రాజు గారు వంటి వారితో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. రౌడీ జనార్థన టైటిల్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. రౌడీ జనార్థన ఎలా ఉంటాడో పరిచయం చేసి ఆ తర్వాత టైటిల్ రివీల్ చేయాలని అనుకున్నాం. కానీ టైటిల్ మీకు తెలిసిపోయింది. సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా వస్తోంది. అందుకు మా టీమ్ మెంబర్స్ చాలా కష్టపడుతున్నారు. ఇకపై మా మూవీ నుంచి రిలీజ్ చేసే కంటెంట్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ కథ చెప్పిన కొద్దిసేపటికే విజయ్ ఆ క్యారెక్టర్ లా మాట్లాడటం, చెప్పే సీన్ కు రౌడీ జనార్థనలా రియాక్ట్ అవడం మొదలుపెట్టాడు. ఇన్ స్టంట్ గా క్యారెక్టర్ ను ఓన్ చేసుకున్నాడు. నాకు ఎంకరేజింగ్ గా అనిపించి మిగతా స్క్రిప్ట్ ను ఉత్సాహంగా చెప్పేశాను. ఆ తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. వర్క్ షాప్స్ అన్నీ చేసి ఫస్ట్ డే షూట్ కోసం సెట్ రెడీ చేస్తున్నాం. 8 నిమిషాల లాంగ్ సీన్ చేయాలి. ఆ ముందు రోజే విజయ్ సెట్ లోకి వచ్చి ఆ డైలాగ్స్ మొత్తం చెప్పేస్తున్నాడు. అప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది.
ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ గారు చాలా ఆక్యురేట్ గా డైలాగ్స్ చెబుతున్నారు. నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. విజయ్ ఆ యాసలో మాట్లాడటం మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం. కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం అనేది కూడా అంతే బాగుందని రాజు గారు అనేవారు. అలాగే ఈ యాసలో డైలాగ్స్ ఫ్లేవర్ అలాగే రావాలని విజయ్, రాజు గారు పర్టిక్యులర్ గా ఉండేవారు. అన్నారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ – రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్ మీకు చూపించేందుకు రవి కిరణ్ కొద్ది రోజులుగా తన టీమ్ తో వర్క్ చేస్తూ వచ్చాడు. మూడు రోజుల క్రితం ఈ సినిమాను ఎలా చూపించబోతున్నాం అనేది చిన్న స్టోరీ రివీల్ చేశాడు. విజయ్ దేవరకొండ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ వచ్చాడు కానీ తొలిసారిగా ఈ మూవీలో ఆంధ్రలోని ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. విజయ్ ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడటం ఈ స్టోరీ విన్నప్పుడు నాకు యూనిక్ గా అనిపించింది. విజయ్ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి యూత్ ఫుల్ మూవీస్ చేశాడు. కానీ ఇప్పటిదాకా ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో విజయ్ కనిపించబోతున్నాడు. 80 దశకం బ్యాక్ డ్రాప్ లోని వరల్డ్ ను ఈ సూపర్బ్ టెక్నీషియన్స్ అంతా క్రియేట్ చేశారు. రవికిరణ్ విజన్ లోని కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ఈ టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మేము ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి మంచి గ్లింప్స్ మీ ముందుకు వచ్చింది. సినిమా కూడా అలా వచ్చేవరకు రవి కష్టపడి చేయించుకుంటాడని నమ్మకం ఉంది. రాజా వారు రాణి గారు అనే చిన్న సినిమా చేసి ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకోగలిగాడు. రెండో సినిమాకు మంచి స్క్రిప్ట్ అందించాడు. ఇప్పుడు మూడో సినిమాకు రౌడీ జనార్థనతో పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు. మీ అందరినీ అలరించేందుకు నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కు మూవీని తీసుకొస్తాం.






