మరోసారి తెరపైకి ట్యాక్సీవాలా కాంబో
రీరికార్డింగ్ కూడా కాకముందే పైరసీ అయిన సినిమా ట్యాక్సీవాలా అప్పట్లో సంచలనం సృష్టించింది. రిలీజ్ కు ముందే సినిమా పైరసీ వచ్చినా సరే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి, మంచి కలెక్షన్లను వసూళ్లు చేసి నిర్మాతకు లాభాల్ని చేకూర్చింది. హర్రర్ టచ్ తో రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ ను చూసి నాని, శ్యామ్ సింగరాయ్ మూవీకు ఆఫర్ ఇచ్చాడు.
నానితో తీసిన శ్యామ సింగరాయ్ కూడా మంచి హిట్ అవడంతో ఈ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని సమాచారం. ట్యాక్సీ వాలా హీరో విజయ్ దేవరకొండతో మరోసారి రాహుల్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించాలని ప్లాన్ చేస్తుందట.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సీరియస్ ఇష్యూ మీద ఈ పీరియాడికల్ ఫిల్మ్ తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే మైత్రీతో రెండు సినిమాలు చేసిన విజయ్, ఆ రెండు సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ సినిమాతో అయినా విజయ్ మైత్రీ బ్యానర్‌కు హిట్టిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తవగానే గౌతమ్ తిన్ననూరి మూవీ చేయనున్నాడు. ఈ లోపు రాహుల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని రెడీ అయిపోతాడు కాబట్టి 2024 సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే అనౌన్స్ కానుంది.













