దక్షిణాది హీరోల్లో విజయ్ దేవరకొండ నెంబర్ వన్?

ఈ న్యూస్ ఇచ్చినోడికి మెంటలా? అదేంటి అంత మంది టాప్ హీరోలు ఉండగా విజయ్ దేవరకొండ నెంబర్ వన్ ఏంటి అనుకునేరు? విషయం ఏమిటంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో నంబర్ వన్ పొజిషన్ కి వెళ్ళాడు. సినిమాల్లో విజయ్ ప్రదర్శించే హీరోయిజానికి ఎంత మంది ఫాలోవర్లు ఉంటారో.. సోషల్ మీడియాలో అతని యాటిట్యూడ్, వ్యక్తిత్త్వానికి అంత మంది ఫాలోవర్లు ఉంటారు. అలా సోషల్ మీడియా ప్రపంచంలో విజయ్ దేవరకొండకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూ పోతోంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలెంతో మందిని విజయ్ దేవరకొండ ఓ విషయంలో వెనక్కి నెట్టేస్తున్నారు. ఇన్ స్టాగ్రాంలో విజయ్ దేవరకొండ దూసుకుపోతోన్నారు. దక్షిణాది హీరోల్లో విజయ్ దేవరకొండ ముందంజలో ఉన్నారు. విజయ్, మహేష్ బాబు, రజినీకాంత్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేశారు. రోజురోజుకూ ఇన్ స్టాలో ఫాలోవర్లను పెంచుకుంటూ పోతోన్నారు. ఇప్పుడు తాజాగా విజయ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసేశారు.
ఇన్ స్టాలో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో విజయ్ సౌత్ నెంబర్ వన్ హీరోగా మారిపోయారు. ఇప్పటి వరకు మహేష్ బాబు (6.7), ప్రభాస్ (6.5), రజినీకాంత్ (707K), ఎన్టీఆర్ (2.6), రామ్ చరణ్ (3.9), అల్లు అర్జున్ (11.8) మిలియన్లతో ఇలా అందరూ కూడా విజయ్ దేవరకొండ వెనకాలే ఉండిపోయారు. అల్లు అర్జున్ ఒక్కడు మాత్రం మాత్రం విజయ్‌కి దగ్గర్లో (11.8)ఉన్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో దూసుకుపోతోన్నారు. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో బాలీవుడ్‌లో పాగా వేసేందుకు విజయ్ ప్లాన్ వేశారు. వినాయక చవితి కానుకగా దీన్ని సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే కరోనా కారణంగా సినిమా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.