రౌడీ హీరోకు ఓజి షాక్
పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు తిరిగి షూటింగ్ కు వెళ్తాయో ఇంకా కరెక్ట్ డేట్స్ తెలీలేదు కానీ అతి త్వరలో అని మాత్రం ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కమిట్ అయిన సినిమాలన్నింటిలో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఓజి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం టీజర్ ను మాత్రమే రిలీజ్ చేశారు కానీ అంచనాల పరంగా మాత్రం ఓజిపై హైప్ ఓ రేంజ్ లో ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ న్యూస్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు షాకిచ్చే విషయమే. ఎందుకంటే విజయ్- గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మార్చి 28న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ కొన్ని వారాల ముందటే అనౌన్స్ చేశారు. ఇప్పుడు సడెన్ గా ఓజి పోటీకి దిగింది.
అయితే పవన్ సినిమాతో పోటీ పడాలని విజయ్ సినిమాను నిర్మిస్తున్న నాగవంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పలుమార్లు చెప్పాడు. ఒకవేళ నిజంగా ఓజి చెప్పిన డేట్ కు వచ్చేట్లయితే విజయ్ దేవరకొండ సినిమా వాయిదా పడక తప్పదు. అయితే వెంటనే విజయ్ సినిమాను వాయిదా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ ఏపీ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పినట్లు డేట్స్ ఇచ్చే పరిస్థితులుండవు. కాబట్టి ఓజి షూటింగ్ పూర్తయేవరకు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. మొత్తానికి పవన్ సినిమా విజయ్ కు ఇప్పుడు పెద్ద టెన్షన్ గా మారింది.













