విజయ్ టార్గెట్ పెద్దదే!
ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ నందనందనాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
విజయ్- పరశురామ్ కాంబోలో వచ్చిన గీతా గోవిందం మంచి హిట్ అవడంతో ఇప్పుడు మరోసారి వారిద్దరూ కలిసి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. విజయ్ నుంచి ఫ్యాన్స్ ఏయే అంశాలను ఆశిస్తారో అవన్నీ ఫ్యామిలీ స్టార్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఫ్యామిలీ స్టార్ తో విజయ్ చాలా పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రూ.25 కోట్ల వరకు ఖర్చు పెట్టగా, రూ.40 కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్సుంది. అందుకే ఫ్యామిలీ స్టార్ తో విజయ్ రూ.100 కోట్ల కు టార్గెట్ చేశాడని తెలుస్తోంది. విజయ్ నుంచి మంచి కంటెంట్ వస్తే ఆ సినిమాకు కలెక్షన్స్ పరంగా ఎలాంటి లోటు ఉండదు. దానికి తోడు ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్. ఇప్పటికే సీతారామం, హాయ్ నాన్న లాంటి బ్లాక్ బస్టర్లను తన అకౌంట్ లో వేసుకున్న మృణాల్, ఫ్యామిలీ స్టార్ తో హిట్ అందుకుని హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తుంది. మరి ఫ్యామిలీ స్టార్ తో విజయ్ తన టార్గెట్ ను రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.













