VD12: పాట కోసం రెడీ అవుతున్న విజయ్
ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమా తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జెర్సీ(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తన 12వ సినిమాను చేస్తున్న విజయ్ తన ఫోకస్ అంతా ఆ సినిమాపైనే పెట్టాడు. అందుకే వేరే సినిమాలను ఒప్పుకున్నా ఇది పూర్తయ్యే వరకు వాటి జోలికి వెళ్లడం లేదు.
వీడీ12(VD12) షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. ఫిబ్రవరి లోపు షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం విజయ్ ఇప్పుడు వీడీ12 సాంగ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం రెండు మూడు రోజులుగా డ్యాన్సర్లతో కలిసి రిహార్సల్స్ చేస్తున్నాడట విజయ్.
ఈ పాటలో పదుల సంఖ్యలో డ్యాన్సర్ల ఉండటంతో విజయ్ దాని కోసం ప్రిపేర్ అవుతున్నాడట. త్వరలోనే ఈ సాంగ్ ను షూటింగ్ చేయబోతున్నారు. ఈ పాట మినహా రెండు కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తే సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్టే అని తెలుస్తోంది. ప్యాచ్ వర్క్ తో కలిపి మొత్తం ఫిబ్రవరికి గుమ్మడికాయ కొట్టేస్తే మార్చి 28న సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో నిర్మాత నాగవంశీ(Naga Vamsi) నిర్మిస్తున్నాడు.













