Kingdom: బ్రదర్ సెంటిమెంట్ పైనే విజయ్ ఆశలు
వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ(vijay devarakonda) తన తాజా సినిమా కింగ్డమ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు కింగ్డమ్ (Kingdom) కోసం విజయ్ అదే రేంజులో కష్టపడ్డాడు కూడా. విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
శ్రీలంకలోని శరణార్థుల కోసం విజయ్ చేసే సాహసమే కింగ్డమ్ సినిమా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో దానికి మించిన సెంటిమెంట్ ఉంటుందని, కింగ్డమ్ లో విజయ్- సత్యదేవ్(Satyadev) మధ్య వచ్చే ట్రాక్ ను గౌతమ్ నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కించాడని, సినిమాలో అన్నింటికంటే అదే మేజర్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ఇప్పటికే కింగ్డమ్ పై మంచి అంచనాలున్నాయి. మరో రెండ్రోజుల్లో ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేయనున్నారు మేకర్స్. వీకెండ్ నుంచి విజయ్ దేవరకొండతో పాటూ మిగిలిన టీమ్ కూడా మీడియా ముందుకు రానున్నారు. మరి ఈ బ్రదర్ సెంటిమెంట్ అయినా విజయ్ కు విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.







