Vijay Devarakonda: మరోసారి లైగర్ ఫార్ములాని ఫాలో అవుతున్న విజయ్
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో కింగ్డమ్(Kingdom) అనే యాక్షన్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. మే 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్(Sithara Entertainments) లో నాగవంశీ(Naga Vamsi) ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.
రీసెంట్ గా నాగవంశీ ఓ ఇంటర్య్వూలో కింగ్డమ్(Kingdom) మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఈ మూవీకి విజయ్(Vijay) రెమ్యూనరేషన్ గా చాలా తక్కువ డబ్బే తీసుకుంటున్నాడని, మూవీ రిలీజయ్యాక వచ్చే లాభాల్లో కొంత షేర్ ను తీసుకోనున్నాడని వంశీ వెల్లడించాడు. హీరోలందరూ ఇలానే ఆలోచిస్తే భారీ మొత్తంలో సినిమాకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందని నాగవంశీ అన్నాడు.
విజయ్ గతంలో ఓసారి ఈ ఫార్ములాని ఫాలో అయ్యాడు. లైగర్(Liger) షూటింగ్ టైమ్ లో బడ్జెట్ ఇష్యూ రావడంతో తన రెమ్యూనరేషన్ లో ఎక్కువ మొత్తాన్ని తిరిగి ఇచ్చి షూటింగ్ ఆగకుండా చేశాడు. ఇప్పుడు కింగ్డమ్ కు కూడా విజయ్ అలానే చేస్తున్నాడు. అయితే లైగర్ కు ముందే రెమ్యూనరేషన్ తీసుకుని తర్వాత వెనక్కి ఇచ్చాడు. ఇప్పుడలా కాకుండా కొంత డబ్బే తీసుకుని, మిగిలింది ప్రాఫిట్స్ వచ్చాక తీసుకుంటా అని చెప్పాడట రౌడీ హీరో.













