సీమ స్లాంగ్లో అదరగొట్టనున్న రౌడీ హీరో
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నప్పటికీ అది వర్కవుట్ అవడం లేదని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి విజయ్, ఫ్యామిలీ స్టార్ తో పాటూ గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ ఫ్యామిలీ స్టార్ ను త్వరగా పూర్తి చేయాలనే నేపథ్యంలో గౌతమ్ సినిమాకు గ్యాప్ ఇచ్చి మరీ ఈ సినిమాకు డేట్స్ ను కేటాయించాడు విజయ్. అయితే ఇప్పుడు విజయ్ తో మూవీ చేయడానికి ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్య్సన్ కూడా రెడీ అవుతున్నాడు. ట్యాక్సీవాలా టైమ్ లోనే వీరిద్దరూ ఓ సినిమా చేయాలనుకున్నారు. అది ఇన్నాళ్లకు కుదిరేట్లు కనిపిస్తుంంది.
విజయ్ కోసం రాహుల్ ఓ డిఫరెంట్ రాయలసీమ బ్యాక్డ్రాప్ లో కథను రెడీ చేశాడని, విజయ్ క్యారెక్టర్ ను నెవర్ బిఫోర్ అనేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో క్యారెక్టర్ కోసం విజయ్ రాయలసీమ స్లాంగ్ పై పట్టు సాధించేందుకు ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నాడని సమాచారం. ఇప్పటివరకు తెలంగాణ యాసలో ఆడియన్స్ ను మెప్పించిన విజయ్, ఇప్పుడు రాయలసీమ యాస మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను కంప్లీట్ చేసి, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. గౌతమ్ సినిమాతో పాటూ రాహుల్ సినిమాను కూడా ఒకేసారి షూటింగ్ మొదలుపెట్టి ఫినిష్ చేయాలని చూస్తున్నాడట విజయ్.













