ఆ విషయంలో ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తున్న విజయ్
అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా యూత్ లో సూపర్ క్రేజ్, ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండకు ఆ తర్వాత గీత గోవిందం తప్ప మరో చెప్పుకోదగ్గ హిట్ లేదు. క్రేజ్ ను అయితే అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు కానీ తన స్థాయిని పెంచుకోవడంలో మాత్రం విజయ్ ఫెయిల్ అవుతున్నాడు. గతేడాది శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత తో కలిసి చేసిన ఖుషి సినిమా ఫర్వాలేదనిపించింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా హిట్ టార్గెట్ గా రూపొందుతుంది. ఫ్యామిలీ స్టార్ పూర్తయ్యాక విజయ్, గౌతమ్ తిన్ననూరితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు. స్పై థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా ఎంత త్వరగా మొదలైనా సరే పూర్తవడానికి కనీసం ఆరు నెలలు టైమ్ పడుతుంది.
అంటే రిలీజ్ ఈ ఏడాది చివర్లో దాదాపు కష్టమే. ఓ వైపు యంగ్ హీరోలందరూ వరుసగా సినిమాలను చేసుకుంటూ ఒక్కోసారి రెండు సినిమాలను లైన్ లో పెడుతుంటే విజయ్ దేవరకొండ మాత్రం ఒక సినిమాను ఫినిష్ చేసేవరకు మరో సినిమా చేయకపోవడం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. అందుకే సినిమా సినిమాకు మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలని, స్పీడు గా సినిమాలను చేయాలని విజయ్ ను ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఫ్యాన్స్ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని విజయ్ వరుసగా సినిమాలను ప్లాన్ చేస్తాడో లేదో చూడాలి.













