అప్రమత్తమైన వేట్టయాన్ టీమ్
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amithab Bachan) ఈ మధ్య సౌత్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. తెలుగులో సైరా(Sye Raa), కల్కి(Kalki) సినిమాల్లో నటించి ఆ సినిమాలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిన అమితాబ్ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) వేట్టయాన్(Vettayan) సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. గతంలో అమితాబ్ సినిమాల్లో రజినీ క్యామియో చేయగా, ఇప్పుడు అమితాబ్ రజినీ సినిమాలో నటించి బదులు తీర్చుకున్నాడు.
జై భీమ్(Jai Bheem) ఫేమ్ జ్ఞానవేల్(Gnanavel) రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 10న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అమితాబ్ పాత్రకు ముందుగా ప్రకాష్ రాజ్(Prakash Raj) తో డబ్బింగ్ చెప్పించారు. అమితాబ్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ లో ప్రకాష్ రాజ్ వాయిసే వినిపించింది. అయితే ప్రకాష్ రాజ్ వాయిస్ అందరికీ బాగా తెలియడంతో పాటూ ఆ వాయిస్ అమితాబ్ కు అసలు సూట్ అవకపోవడంతో ఈ టీజర్ పై నెట్టింట నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.
దీంతో అప్రమత్తమైన వేట్టయాన్ టీమ్ సినిమాలో ప్రకాష్ రాజ్ వాయిస్ ను తీసేసిందట. అలా అని తన పాత్రకు అమితాబ్ సొంతంగా డబ్బింగ్ చెప్పాడా అంటే అదీ లేదు. ఏఐ సాయంతో అమితాబ్ డబ్బింగ్ చెప్పినట్లు మేనేజ్ చేయబోతున్నారట. లేని మనుషుల వాయిస్ ను సాంగ్స్ కోసం ఏఐతో రీక్రియేట్ చేయడం చూశాం కానీ ఇలా బతికున్న వారి వాయిస్ ను కూడా ఏఐ(AI)తో మేనేజ్ చేయడం విశేషమే. చూస్తుంటే ముందుముందు ఏఐ సాయంతో మరెన్ని అద్భుతాలు చేస్తారో అనిపిస్తోంది.













