Saroja Devi: అలనాటి నటి సరోజా దేవి ఇక లేరు

కోటా(Kota Srinivasa rao)మరణ వార్త నుంచి టాలీవుడ్ తేరుకోకముందే ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. ఒకప్పుడు ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్(ANR) తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సరోజా దేవి(Saroja Devi) చనిపోయారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సరోజా దేవి బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్ను మూశారు. సరోజా దేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.
కేవలం ఒక రోజు తేడాలో ఇద్దరు గొప్ప నటుల్ని కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటుగా అంతా భావిస్తున్నారు. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన బి. సరోజా దేవి మహాకవి కాళిదాసు(Mahakavi Kalidasu) అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు పాండురంగ మహాత్మ్యం(Panduranga mahatmyam) అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటరయ్యారు.
180కి పైగా సినిమాల్లో నటించిన సరోజా దేవి ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో చాలా హిట్ సినిమాలు చేసినప్పటికీ సరోజా దేవికి కోలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు, క్రేజ్ దక్కింది. అందుకే ఎంజీఆర్(MJR) తో ఏకంగా 26 సినిమాలు చేశారామె. శివాజీ గణేషన్(Sivaji Ganeshan) తో 22 సినిమాలు, జెమినీ గణేషన్(Gemini Ganeshan) తో 17 సినిమాల్లో నటించిన ఆమె మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు ఆమెకు సంతాపం తెలియచేస్తున్నారు.