వైజాగ్‌కు వెళ్తున్న వెంకీ మామ
బాబీ దర్శకత్వంలో వెంకీ-చైతు కాంబినేషన్లో పుల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న చిత్రం వెంకీ మామ. కాగా ఈ చిత్రం 25 రోజులపాటు కశ్మీర్లో చిత్రీకరించారు. ఈ షూట్లో దాదాపు 250 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తర్వాత షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో వెంకటేష్, నాగచైతన్యలపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా 75 శాతం పూర్తవుతుందట. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్‌రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశిఖన్నా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.













