Venky Atluri: మరో తమిళ హీరోని లైన్ లో పెట్టిన వెంకీ?
తొలి ప్రేమ(Tholi Prema) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వెంకీ అట్లూరి(Venky Atluri) ఆ తర్వాత మిస్టర్ మజ్ను(Mr.Majnu), రంగ్ దే(Rang De) సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలూ ఆశించిన స్థాయిలో మెప్పించనప్పటికీ ధనుష్(Dhanush) తో వెంకీ(Venky) చేసిన సార్(Sir) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలాగే రూ.100 కోట్ల కలెక్షన్స్ ను కూడా వెంకీ ఈ సినిమాతో సాధించాడు.
రీసెంట్ గా దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమా చేసి మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో వెంకీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నప్పటికీ అతను తెలుగు హీరోలతో సినిమాలు చేయడం లేదని అపవాదుని మాత్రం మూటగట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే వెంకీ ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సూర్య. ప్రస్తుతం సూర్య(Suriya)తో వెంకీ స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో నాగవంశీ(Naga Vamsi)నే ఈ సినిమాను నిర్మించబోతున్నాడట. దాదాపు ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయిందంటున్నారు.













