మరో సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న వెంకీ, చైతూ
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. అలాంటి క్రేజ్ ఉన్న కాంబినేషన్లో మళ్లీ మళ్లీ సినిమాలు రావాలని ఆడియన్స్ ఆశిస్తారు. అలాంటి కాంబినేషన్ ఒకటి ఇప్పుడు మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. వారిద్దరూ మరెవరో కాదు విక్టరీ వెంకటేష్, నాగచైతన్య. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా వెంకీ మామ.
బాబీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి మొదట్లో ప్రేమమ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీని చూసి హీరోలుగా వెంకీ మామ సినిమాను తీశాడు బాబీ. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబోలో ఓ సినిమాకు ఇద్దరూ రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
స్టూడియో గ్రీన్ బ్యానర్లో జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు స్కోప్ ఉండగా సీనియర్ హీరోగా వెంకీని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న సూరి, రెండో హీరోగా చైతూని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.













