వెంకీకి ఆ రిస్క్ అవసరమా?
రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజైన సైతాన్ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. అజయ్ దేవగన్, జ్యోతిక జంటగా నటించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ గా మెప్పించాడు. ఈ హార్రర్ థ్రిల్లర్ ను రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ప్రస్తుతం వెంకీ ఉన్నాడని తెలుస్తోంది.
రీసెంట్ గా ఈ సినిమా చూసిన వెంకీకి సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చడంతో రీమేక్ చేయాలనిపించిందట. కాకపోతే ఇందులో రిస్క్ ఎక్కువగానే ఉంది. సైతాన్ సినిమాలో మాధవన్ క్యారెక్టర్ మీదే సినిమా నడుస్తుంది. పూర్తి నెగిటివ్ షేడ్స్ లో ఈ సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో ఏకంగా భయపెట్టేస్తాడు. అజయ్ దేవగన్ క్యారెక్టర్ కేవలం రెండు మూడు ఎమోషన్స్ మీదే ఉంటుంది.
వెంకటేష్ ఇమేజ్ కు అజయ్ దేవగన్ క్యారెక్టర్ అసలు సూట్ అవదు. మాధవన్ క్యారెక్టర్ చేద్దమా అంటే అంత నెగిటివ్ రోల్ లో వెంకీని తెలుగు ఆడియన్స్ కలలో కూడా ఒప్పుకోరు. అప్పుడెప్పుడో నాగవల్లి సినిమాలో కాసేపు అలా కనిపిస్తేనే ఆ సినిమాను రిజెక్ట్ చేశారు. పోనీ ఒకవేళ మాధవన్ ఒప్పుకుంటే తన పాత్ర ముందు వెంకీ క్యారెక్టర్ తేలిపోతుంది. కాబట్టి ఈ సినిమాను వెంకీ వద్దనుకోవడమే బెటర్. ఇంకా ఈ ఆలోచన ప్రతిపాదన దశలోనే ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకీ రానా నాయుడు2, అనిల్ రావిపూడి సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.













