Venkatesh: బాలయ్యతో వెంకీ మల్టీస్టారర్

సినీ పరిశ్రమలో మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఎవరైనా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారంటే ఇక ఆయా హీరోల ఫ్యాన్స్ మామూలు ఆనందంలో ఉండరు. అనౌన్స్‌మెంట్ తర్వాతి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్ లో రాబోతుంది.
అయితే ఆ హీరోలు మరెవరో కాదు, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), విక్టరీ వెంకటేష్(Daggubati Venkatesh). త్వరలోనే వీరిద్దరూ ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా వెంకటేష్ వెల్లడించారు. అమెరికాలో జరుగుతున్న తానా(TANA) సభలకు హారజరైన వెంకటేష్ తాను చేయబోచే సినిమాల లైనప్ ను అనౌన్స్ చేశారు. అందులో భాగంగానే ఈ మల్టీస్టారర్ గురించి కూడా రివీల్ చేశారు వెంకీ(venky).
వెంకీ లైనప్ లో ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram) తో సినిమా, చిరంజీవి(Chiranjeevi)తో అనిల్ రావిపూడి(anil ravipudi) చేస్తున్న మెగా157(mega157)లో ఓ క్యామియో, దృశ్యం3(Drishyam3), అనిల్ రావిపూడితో మరో సినిమా, ఆ తర్వాత బాలయ్య(Balayya)తో ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్టు వెంకీ తెలిపారు. దీంతో అటు దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ లో ఈ మల్టీస్టారర్ పై ఇంట్రెస్ట్ నెలకొంది. మరి ఈ క్రేజీ మల్టీస్టారర్ కు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది తెలియాల్సి ఉంది.