VD12: క్రేజీ టైటిల్‌ను పట్టేసిన విజయ్ దేవరకొండ
లైగర్(Liger), ఖుషి(Kushi), ఫ్యామిలీ స్టార్(Family Star) తో వరుస ఫ్లాపులందుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ అవసరం. ఈ నేపథ్యంలోనే జెర్సీ(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri)తో ఓ మూవీ చేస్తున్నాడు. విజయ్ కెరీర్లో 12వ సినిమాగాగా ఇది తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో నిర్మాత నాగవంశీ(Naga Vamsi) భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి.
మామూలుగా అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా కారణంగా వీడీ12కు బ్రేక్ ఇచ్చి విజయ్ ముందు ఆ సినిమాను పూర్తి చేశాడు. లేకపోతే ఇప్పటికే వీడీ12(VD12) షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కూడా అయ్యేది. అయితే షూటింగ్ మొదలై ఇన్ని రోజులవుతున్నా ఈ సినిమా టైటిల్ ను ఇప్పటివరకు మేకర్స్ రివీల్ చేయలేదు.
ఈ నేపథ్యంలోనే వీడీ12 టైటిల్ టీజర్‌ను రివీల్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ వర్క్ పూర్తైందని, ఇన్ని రోజులు అనిరుధ్(Anirudh) బీజీఎం వల్లే లేటైందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సామ్రాజ్యం(Samrajyam) అనే టైటిల్‌ను లాక్ చేసినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. అందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది.













