వరుడు కావలెను టీజర్ విడుదల
నాగశౌర్య, రీతుశర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రం టీజర్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ విడుదల చేశారు. ఈ టీజర్లో చిత్ర కథ, సంభాషణల బలం స్పష్టంగా కనిపిస్తోంది. నాయకా నాయికల పాత్రల మనస్తత్వాలు, అభిరుచులు, ఆలోచనలు, కథానుగుణంగా సాగే వినోదం, సంగీతం, నటినటుల ఉత్తమాభినయం టీజర్లో కనిపిస్తాయి. ఓ ఫీల్‌గుడ్ మూవీని చూడబోతున్నామన్న ఆసక్తిని కలిగిస్తుంది ఈ టీజర్. ఇందులో అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.













