Varanasi: వారణాసి వేగం మామూలుగా లేదుగా
వారణాసి(varanasi) సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్న వేళ, చిత్ర యూనిట్ పనులను మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) మరియు దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో దూసుకుపోతోంది. రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో హైప్ సెట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్‌ను ముందుగానే పూర్తి చేసే దిశగా టీమ్ శరవేగంగా పనిచేస్తోందట. టాకీ పార్ట్‌ను ప్లాన్ ప్రకారం నెమ్మదిగా షూట్ చేస్తూనే, భారీ స్థాయిలో ఉండే గ్రాఫిక్స్ సన్నివేశాలను ముందుగానే సిద్ధం చేస్తున్నారని సమాచారం. పృథ్వీరాజ్ సుకుమారన్(Prithvi raj sukumaran), ప్రియాంక చోప్రా(Priyanka Chopra) లాంటి ప్రముఖులపై తెరకెక్కించాల్సిన కీలక సన్నివేశాలకు అనుగుణంగా వీఎఫ్ఎక్స్ వర్క్స్ ముందుకు సాగుతున్నాయని సమాచారం.
విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజమౌళి ఎక్కడా రాజీ పడటం లేదని టాక్ వినిపిస్తోంది. బడ్జెట్లో గణనీయమైన భాగాన్ని వీఎఫ్ఎక్స్ కోసమే కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ మహత్తర చిత్రానికి కీరవాణి(keeravani) సంగీతం అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలను కార్తికేయ(Karthikeya) మరియు కె.ఎల్ నారాయణ(KL Narayan) నిర్వహిస్తున్నారు. మొత్తం మీద వారణాసి పనులు వేగంగా పూర్తవుతున్నాయని, భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా ఇది నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.













