బేబీ హీరోయిన్ తర్వాత ఎవరితో?
బేబీ మూవీలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కు యూత్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. అన్ని రకాల షేడ్స్ ని మంచి ఈజ్ తో పండించిన వైష్ణవి యాక్టింగ్ కు అందరూ ఇంప్రెస్ అయ్యారు. రీసెంట్గా జరిగిన సక్సెస్ మీట్ లో స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ నుంచి అందరూ వైష్ణవిని అభినందించారు.
చిన్న వీడియోలతో సోషల్ మీడియాలో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన వైష్ణవి టాలీవుడ్ లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు బేబీ సినిమాలో ఏకంగా హీరోయిన్ క్యారెక్టర్ కొట్టేసి మంచి హిట్ అందుకుంది. దీంతో ఇప్పుడు వైష్ణవి తర్వాతి సినిమా ఎవరితో చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం వైష్ణవి తన తర్వాతి మూడు సినిమాలను ఎస్కేఎన్-మారుతి బ్యానర్లోనే చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
బేబీ రిజల్ట్ తేడా కొడితే తర్వాతి సినిమాలు ఉండకపోయేవేమో కానీ ఇప్పుడు బేబీ బ్లాక్ బస్టర్ కావడంతో మిగిలిన మూడు సినిమాలు పట్టాలెక్కే ఛాన్సుంది. కానీ ఈ డీల్ నిజంగానే జరిగిందా లేదా అనేది అఫీషియల్ గా తెలీలేదు కానీ ఈ మాట నిజమనేది ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాగూ హీరోయిన్ల కొరత ఉంది కాబట్టి వైష్ణవి హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి ఇదే సరైన టైమ్. కాకపోతే వైష్ణవి గ్లామరస్ రోల్స్‌కి ఏ మాత్రం సరిపోతుందనేదే డౌట్.













