బడా ఛాన్స్ కొట్టేసిన బేబీ
ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద హిట్ గా నిలిచిన సినిమా బేబీ. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సాయి రాజేష్, ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ వరుసగా మూవీస్ అనౌన్స్ చేస్తున్నారు. వీరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు రానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆల్రెడీ బేబీ మూవీ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా బిజీగా అయ్యాడు.
బేబీలో నటించిన హీరోయిన్ వైష్ణవికి కూడా మూడు నాలుగు సినిమాల ఆఫర్లొచ్చినట్లు టాక్. వాటిలో ఒకటి ఆనంద్ దేవరకొండతో అని ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇక రీసెంట్ గా వైష్ణవి ఖాతాలో మరో సినిమా ఛాన్స్ పడింది. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా బయటకు వచ్చింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు బ్యానర్ లో వైష్ణవి ఛాన్స్ కొట్టేసింది.
దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్గా నటించబోతుంది. అరుణ్ భీమవరపు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. రీసెంట్గా ఆయన మూడో సినిమా అనౌన్స్ అయింది. ఆ సినిమాలో వైష్ణవి మోడ్రన్ అమ్మాయిగా కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ మూవీకి లవ్ మి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట.













