వైష్ణవి తర్వాతి సినిమా ఏంటి?
అంచనాలేమీ లేకుండా రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆ సినిమా రిలీజైన రెండు మూడు వారాల పాటూ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో నిలిచింది. హీరోయిన్ పాత్రకు న్యాయం చేస్తూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన వైష్ణవి గురించి ఇప్పుడే వార్త వినిపించడం లేదు.
నిర్మాత ఎస్కెఎన్తోనే మరో రెండు సినిమాలకు సైన్ చేసిందని బేబీ రిలీజ్ టైమ్ లో వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు అసలు ఆ రెండు సినిమాలకు స్టోరీలే రెడీగా లేవని తెలుస్తోంది. స్టోరీ లేనప్పుడు ఇక సినిమా పట్టాలెక్కడం ఎప్పుడనేది చెప్పడం కష్టమే. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో శిరీష్ హీరోగా రానున్న ఓ సినిమాలో కూడా హీరోయిన్ గా వైష్ణవి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కాక ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కోసం మెగా కాంపౌండ్ కు చెందిన ఓ డైరెక్టర్ కూడా వైష్ణవి డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బేబీ లాంటి సక్సెస్ వచ్చినా కూడా వైష్ణవికి బడా బ్యానర్ నుంచి ఇప్పటివరకు ఛాన్స్ రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆనంద్ దేవరకొండ లాంటి అప్కమింగ్ స్టార్ హీరో పక్కన నటించడం వల్లే తనకు ఇంకా పెద్ద అవకాశాలు రావట్లేదా అని కొందరు అంటున్నారు.













