Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్

ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్(pawan kalyan). అందులో భాగంగానే ఇప్పటికే హరిహర వీరమల్లు(hari hara veeramallu)ను పూర్తి చేసి రిలీజ్ చేసిన పవన్, త్వరలోనే ఓజి(OG) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబర్ 25న ఓజి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఆల్రెడీ వీరమల్లు, ఓజిలను పూర్తి చేసిన పవన్ వాటితో పాటే ఒప్పుకున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh) ను పూర్తి చేయాల్సి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో పవన్ బిజీగా ఉన్నారు. గబ్బర్ సింగ్(Gabbar singh) సినిమా తర్వాత హరీష్ శంకర్(harish shankar) దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్‌సింగ్ పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో పూర్తవాల్సింది కానీ మధ్యలో పవన్ రాజకీయాలు, వేరే సినిమాలతో బిజీ అవడం వల్ల ఇది లేటైంది. ఇప్పుడు ఈ సినిమాను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు పవన్. అందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తుండగా సెప్టెంబర్ 13 నాటికి తన పోర్షన్ షూటింగ్ ను పూర్తి చేయనున్నారట పవన్. ఆ తర్వాత మిగిలిన షూటింగ్ ను కూడా పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారట హరీష్ శంకర్. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల(sreeleela), రాశీ ఖన్నా(raashi khanna) హీరోయిన్లు గా నటిస్తున్నారు.