Ustaad Bhagath Singh: బేబీ జాన్ చూసి ఉస్తాద్ నేర్చుకోవాల్సిందే!
భారీ అంచనాలతో విజయ్(VIjay) బ్లాక్ బస్టర్ మూవీ తేరీ(Theri) రీమేక్ గా అట్లీ(Atlee) నిర్మాణంలో కలీస్(Kalees) దర్శకత్వం వహించిన బేబీ జాన్(Baby John రిలీజైంది. చిత్ర యూనిట్ మొత్తం అసలు గ్యాపే లేకుండా ప్రమోషన్స్ చేశారు. కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ అవడంతో సినిమా ఎలా ఉందో చూద్దామనే తెలుగు ఆడియన్స్ కూడా ఉన్నారు. అయితే వరుణ్ ధావన్)(Varun Dhawan) ను ఇంత మాస్ రోల్ లో చూడగలమా లేదా అనే డౌట్ మాత్రం అందరికీ ఉంది.
థియేటర్లలోకి వచ్చిన బేబీ జాన్ యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు కానీ ఓకే అనిపించుకుంది. కానీ ఒరిజినల్ తేరీ చూసిన వారికి మాత్రం ఈ సినిమాలో ఎలాంటి స్పెషాలిటీ కనిపించదు. విజయ్ స్వాగ్ ను వరుణ్ ధావన్ అసలు మ్యాచ్ చేయలేకపోయాడనే కామెంట్ బాగా వినిపిస్తోంది. కాకపోతే తమన్(Thaman) బీజీఎం, నిర్మాణ విలువలు, సల్మాన్ ఖాన్(Salman Khan) క్యామియో సినిమాను నిలబెట్టాయి.
అయితే ఇప్పుడు బేబీ జాన్ రిజల్ట్ ను చూసి ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) టీమ్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తేరీ రీమేక్ కావడం వల్ల పవన్ ఫ్యాన్స్ అసలే టెన్షన్ గా ఉన్నారు. మార్పులు చేయడంలో హరీష్ శంకర్(Harish Shankar) కు మంచి టాలెంట్ ఉందని తెలిసినప్పటికీ మిస్టర్ బచ్చన్(Mr. Bachan) రిజల్ట్ చూసి పవన్ ఫ్యాన్స్ ఇంకా టెన్షన్ పడుతున్నారు. ఏదేమైనా బేబీ జాన్ ను చూసి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో హరీష్ శంకర్ గుర్తిస్తే ఉస్తాద్ కు మంచి ఫలితం దక్కుతుంది.













