అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఎపిసోడ్ 3: మోస్ట్ అన్ ఫిల్టర్డ్ గెస్ట్, సీటీమార్ లైన్ అవార్డులని గెలుచుకున్న మాస్ మహారాజా రవితేజ… సరికొత్త ఎనర్జినిచ్చిన స్పెషల్ అవార్డ్స్ ఎపిసోడ్!”
అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ తిరులేని ఆదరణను దక్కించుకుంటున్న వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. ఈ మాధ్యమంలో అపూర్వమైన ఆదరణను దక్కించుకుంటూ దూసుకెళ్తోన్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ఈ కార్యక్రమానికి వస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్ 3 ఆహాలో ప్రసారమైన సంగతి తెలిసిందే. ఎగ్జయిట్మెంట్తె కూడిన ఈ ఎపిసోడ్లో సుహాసిని మణిరత్నం, శ్రియాశరన్లతో పాటు డైనమిక్ డైరెక్టర్స్ హరీష్ శంకర్, జయంత్ సి.పరాన్జీ కూడా పాల్గొన్నారు. ఎపిసోడ్ 3 హోస్ట్ బాలకృష్ణ సహా అతిథులుగా పాల్గొన్నవారందరూ కలిసి సీజన్ 1, సీజన్ 2ల్లో పాల్గొన్న అతిథులను వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిర్ణయించారు. ఈ సరికొత్త స్పెషల్ అవార్డ్స్ ఎపిసోడ్లో ఎనర్జిటిక్ మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అన్ ఫిల్టర్డ్ గెస్ట్, సీటీమార్ లైన్ అవార్డులని గెలుచుకోవటం విశేషం.
ఎపిసోడ్లో లెజెండ్రీ నందమూరి బాలకృష్ణ ఉల్లాసంగా ఉత్సాహంగా అందరిలో నూతనోత్సాహాన్ని నింపారు. ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్‌పై బాలకృష్ణ వేసిన పంచులతో ఎపిసోడ్ అంతా ఎనర్జీతో నిండింది. సుహాసినితో కలిసి బాలకృష్ణ చేసిన సినిమాలను గుర్తుకు చేసుకుంటూ మధుర క్షణాలను పంచుకున్నారు. ఇక శ్రియాశరన్‌తో కలిసి నందమూరి హీరో చేసిన స్టేజ్‌పై చేసిన డాన్స్ అందరి ఉత్సాహాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. అలాగే జయంత్ సి.పరాన్జీ సైతం ఈ ఎనర్జిటిక్ షోలో తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వహించారు.
ఎంతో గొప్పగా రూపొందించిన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్ 3’ను అసలు మిస్ చేయకండి.. చక్కటి వినోదాన్ని పంచుతూ ఎవరి అంచనాలకు అందకుండా మ్యాజిక్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమాన్ని ఆహాలో వీక్షించండి.













