Trivikram: సమంత కోసం త్రివిక్రమ్ ప్రయోగం
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(samantha) గత కొన్నాళ్లుగా ముంబైలోనే ఉంటున్న విషయం తెలిసిందే. మధ్యలో ఏదైనా పనుంటే హైదరాబాద్ రావడం తప్పించి సామ్ అక్కిడికే మకాంను మార్చేసింది. ఈ నేపథ్యంలో మొన్నా మధ్య సమంతను అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తూ, టాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కోరిన సంగతి తెలిసిందే.
దానికి సమంత రెస్పాండ్ అవుతూ, మీరు ఏదైనా కథ రాస్తే తప్పకుండా వచ్చి చేస్తానని కూడా అదే కార్యక్రమంలో చెప్పింది. అయితే ఇప్పుడు అది పట్టాలెక్కేట్టు కనిపిస్తుంది. గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సమంత ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయాలని డిసైడైనట్టు తెలుస్తోంది.
దాని కోసం గురూజీ త్రివిక్రమ్ రంగంలోకి దిగినట్టు సమాచారం. సమంత కోసం త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మామూలుగా అయితే త్రివిక్రమ్ బన్నీ(Bunny) తో సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోకుండా అట్లీ(Atlee) ప్రాజెక్టు ముందుకు రావడంతో వెంకీతో సినిమా చేస్తాడన్నారు. వెంకీ(Venky)తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన కథను కూడా త్రివిక్రమ్ ఆల్రెడీ పూర్తి చేయడంతో ఇప్పుడు తనకు దొరికిన ఖాళీ టైమ్ లో సమంత కోసం కథను రాస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు త్రివిక్రమ్ తన కెరీర్లో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది లేదు కానీ సమంత కోసం మొదటిసారి ఆయన ఈ ప్రయోగం చేయబోతున్నారు.






