మోహన్ లాల్ జోడీగా త్రిష
హేజూడ్ సినిమాతో గత ఏడాది మలయాళంలో అరంగేట్రం చేసింది త్రిష. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంతో తొలి అడుగులోనే విజయాన్ని దక్కించుకున్నది. తాజాగా మలయాళంలో రెండో సినిమాను అంగీకరించిన ఈ సొగసరి మోహన్‌లాల్‌కు జోడీగా నటించబోతున్నది. దృశ్యం తర్వాత మోహన్‌లాల్, దర్శకుడు జీతూజోసఫ్ల కలయికలో మరో సినిమా రాబోతున్నది. థ్రిల్లర్ కథాంశంతో విదేశీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించనున్నది. ఇందులో మోహన్‌లాల్ పాత్రలో సమానంగా ఛాలెంజింగ్‌గా పాత్ర ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది. ఈజిప్ట్, కెనడాతో పాటు పలు దేశాల్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది.













