టాలీవుడ్లో రెండు క్రేజీ ఆఫర్లు కొట్టేసిన త్రిష
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన త్రిషకు ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా కోలీవుడ్ కే అంకితమైంది. ఆ తర్వాత అక్కడ కూడా ఛాన్సులు తగ్గిపోయి ఫేడవుట్ అవుతున్న టైమ్ లో త్రిషకు పొన్నియన్ సెల్వన్ ఆఫర్ తగిలింది. ఆ సినిమా తర్వాత అమ్మడు కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది.
దశాబ్దంన్నర కెరీర్ తర్వాత త్రిష అందం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో భాగంగానే లియో సినిమాలో కావాలని మరీ త్రిషను తీసుకున్నారు. రీసెంట్ గా అజిత్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది త్రిష. అయితే అమ్మడు క్రేజ్ ను చూసి టాలీవుడ్ నుంచి కూడా త్రిషకు ఆఫర్లొస్తున్నాయి. వాటిలో చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభర ఒకటి.
విశ్వంభరలో త్రిష హీరోయిన్ గా ఎంపికవడం దాదాపు ఖాయమే. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ టైమ్ చూసి త్రిషను హీరోయిన్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక దీంతో పాటూ త్రిషకు మరో ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున హీరోగా తమిళ డైరెక్టర్ నవీన్ దర్శకత్వలో తెరకెక్కబోయే సినిమాలో కూడా త్రిషనే అనుకుంటున్నారట. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిష వరుస ఆఫర్లతో కొనసాగడం విశేషమనే చెప్పాలి.













