NTRNeel: ఎన్టీఆర్నీల్ సినిమాలో ఆ మలయాళ నటుడు?
దేవర(Devara) సినిమా సక్సెస్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) వార్2(War2) సినిమా చేసిన విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి చేస్తున్న ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వార్2(war2) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలుండగా ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం కెజిఎఫ్(KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్నీల్(NTRNeel) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టొవినో థామస్(Tovino Thomas) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ కోసం నీల్ ఓ భారీ స్క్రిప్ట్ ను రెడీ చేశాడని, ఆ సినిమాలో టొవినో థామస్, బీజు మీనన్(biju menon) రెండు కీలక పాత్రల్లో నటిస్తున్నారని వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్నీల్ సినిమాతో టొవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయంలో స్పష్టత వచ్చింది. మరి ఈ మూవీలో టొవినో థామస్ ఎలాంటి పాత్ర చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.






