టాప్ 10లో చోటు దక్కించుకున్న బుట్టబొమ్మ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు తెలుగు భాషలోనే కాదు ఇతర భాషలలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా కథ పరంగా కంటే మ్యూజికల్‌గా భారీ సక్సెస్ సాధించింది. చిత్రంలోని ప్రతి సాంగ్ శ్రోతలని ఎంతగానో రంజింపజేసింది. బుట్టబొమ్మ అనే సాంగ్ ఏ రేంజ్లో అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్‌కు క్రికెటర్స్ కూడా ఫిదా అయ్యారంటే ఈ సాంగ్‌కు ఉన్న సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలానే రాములో రాములా అనే పాట కూడా ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఈ రెండు పాటలు ఇండియాలో టాప్ 10 మ్యూజిక్ వీడియోల జాబితాలో నిలిచాయి. బన్నీ సినిమాకి సంబంధించిన రెండు పాటలు టాప్ 10 నిలవడం రికార్డ్ అని అంటున్నారు.













