టైగర్ సేఫ్ అయినట్లేనా?
రవితేజ కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమా అవుతుందనుకున్న టైగర్ నాగేశ్వరరావు ఎన్నో అంచనాల మధ్య దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్, రవితేజ పెర్ఫార్మెన్స్ బాగున్నా చాలా మైనస్‌లు ఉండటంతో టైగర్ నాగేశ్వరరావుకు నెగిటివ్ టాక్ వచ్చింది. కొన్ని అనవసర సీన్స్, సెకండాఫ్ లో లాగ్ సినిమాకు మైనస్ అయ్యాయి.
అందుకే టైగర్ నాగేశ్వరరావుకు మంచి ఓపెనింగ్స్ రాలేదు. తొలి వీకెండ్ చూస్తే రవితేజ కెరీర్లో మరో డిజాస్టర్ అవుతుందేమో అనుకున్నారు. కానీ టైగర్ నాగేశ్వరరావుకు రన్ టైమ్ ఎక్కువని వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను గుర్తించి, సినిమా నిడివిని 2 గంటల 37 నిమిషాల రన్‌టైమ్ తో ఫిక్స్ చేశారు. సినిమా రన్ టైమ్ తగ్గించాక టైగర్ నాగేశ్వరరావుకు కలెక్షన్స్ పెరిగాయి.
దానికి తోడు లియో సినిమాకు కలెక్షన్స్ తగ్గడంతో భగవంత్ కేసరి తర్వాత ఆడియన్స్ కు టైగర్ నాగేశ్వరరావు సినిమానే సెకండ్ ఆప్షన్ అవడంతో ఈ సినిమా మెల్లిగా సేఫ్ జోన్ వైపు అడుగులేస్తుంది. ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన టైగర్ నాగేశ్వరరావు రూ.30 కోట్ల షేర్ మార్క్‌కు దగ్గరగా వచ్చింది. ఫుల్ రన్ అయ్యేసరికి సినిమా సేఫ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.













