బేబీని కాదన్న ముగ్గురు హీరోలు
హృదయ కాలేయం సినిమా చూశాక అసలు ఇలాంటి సినిమా ఎవరైనా తీస్తారా అని సాయి రాజేష్ పై గట్టి ట్రోల్సే వచ్చాయి. సరికొత్త స్థాయిలో సంపూని పరిచయం చేసి సక్సెస్ అయితే అందుకున్నాడు కానీ సాయి రాజేష్ కు మంచి పేరైతే రాలేదు. ఆ సినిమా తర్వాత ఆయనకు రైటర్ గా ఛాన్సులొచ్చినప్పటికీ పెద్దగా రిస్క్ చేయలేదు.
తర్వాత నిర్మాతగా మారి కలర్ ఫోటో సినిమా తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే సాయి రాజేష్ బేబీ స్టోరీ రాసుకున్నప్పుడు ఆయనే ఈ కథ రాశారంటే ఎవరూ నమ్మలేదట. కామెడీ సినిమాలు చేసే సాయి రాజేష్ ఇంత డెప్త్ లవ్ స్టోరీని రాశాడంటే చాలా మందికి డౌట్లు వచ్చాయట. కానీ ప్రొడ్యూసర్ SKN మాత్రం రాజేష్ ని చాలా బాగా నమ్మాడు.
బ్రో సినిమా లో హీరోగా ఆనంద్ దేవరకొండ కంటే ముందు మరో ముగ్గురు హీరోలను అనుకున్నాడట. కానీ ఆ ముగ్గురు ఈ సినిమాను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆఖరికి ఆ ఛాన్స్ ఆనంద్‌ను వరించింది. ముగ్గురిలో స్టోరీ విన్న ఒక హీరో ఇంత పెద్ద రిస్క్ నేను చేయలేను అని అంటే, మరో హీరో సాయి రాజేష్ డైరెక్టర్ అయితే అసలు నేను సినిమా చేయను అని అన్నాడట.
ఆ మాట తెలిసిన సాయి రాజేష్ కు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదని, బేబీ సినిమా రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా సాయి రాజేష్ కెరీర్ రిస్క్ లో పడ్డట్టే అయ్యేది. అందుకే బేబీ సినిమాను ఎంతో కష్టపడి మరీ దర్శకత్వం వహంచానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సాయి రాజేష్.













