తారక్ మనసులో ఉన్నది ఇదేనా???
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్లో మంచి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తుల్లో రాజీవ్ కనకాల మొదటి స్థానంలో ఉంటాడనే చెప్పాలి. వీరిద్దరి స్నేహం ఇప్పటిది కాదు. తారక్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుండి మొన్న వచ్చిన ఆర్ ఆర్ ఆర్ వరకు దాదాపుగా ప్రతి సినిమాలో ఏదొక చిన్న పాత్రలో రాజీవ్ కనకాలని చూసుంటాం. వీరి ఇరువురు స్నేహం వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా.
అయితే రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ని లాంచ్ చేస్తూ, ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడుతూ తన స్నేహితుడు అయిన ఎన్టీఆర్ నోరు మెదపకపోవడానికి కారణమేంటనేది తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. ‘ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు గడిపేశాడు. ఈ వ్యవధిలో తారక్ నాలుగు సినిమాలు చేసే అవకాశం కోల్పోయాడు. ఆ తరువాత తారక్ దేవర అనే సినిమా షూటింగ్ లో చాలా కష్టపడుతున్నాడు. ఆ బిజీలో తారక్ బయట ప్రపంచంలో జరిగే పరిణామాల గురించి ఆలోచించే స్థితిలో లేడు. అందుకే తారక్ ఫోకస్ మొత్తం సినిమా పైన పెట్టాడు ‘ అని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడకపోవడమే మంచిదని కొంతమంది ఫ్యాన్స్ అంటుంటే, మరికొందరు మాత్రం రాజకీయాల్లో తారక్ ప్రవేశానికి సమయం ఇదే అంటూ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీ ఉన్నాడు. ఇక డిసెంబర్ నుండి వార్ 2 , ఆ తరువాత ప్రశాంత్ నీల్ మూవీ, వెంటనే కొరటాల సినిమా ఇలా తారక్ తన లైఫ్ ని బిజీగా మార్చుకున్నాడు. ఇక రాజకీయాలకి టైమ్ ఇస్తాడా లేదా చూడాలి.













