Avatar: Fire & Ash: ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కి ఇండియాలో దుమ్ములేపే క్రేజ్
సినిమా అభిమానులను ఏకకాలంలో మైమరపించిన జేమ్స్ క్యామెరన్ ‘అవతార్’ సిరీస్ మరోసారి భారీ హంగామా సృష్టించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్లో విడుదల కానున్న మూడో భాగం అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire & Ash) కి భారత మార్కెట్లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది.
రీసెంట్ గా బుక్‌మైషో విడుదల చేసిన డేటా ప్రకారం, 12 లక్షలకుపైగా ఇండియన్ లవర్స్ ఈ సినిమాపై తమ ఆసక్తిని చూపారు. అడ్వాన్స్ ఇంటరెస్ట్‌లో ఇంత భారీ నెంబర్లు సాధించడం పెద్ద సినిమాలకే సాధ్యం, అవతార్ మాత్రం ముందే బెంచ్‌మార్క్ సృష్టించింది.
భారత ప్రేక్షకులు మొదటి రెండు భాగాల్లో చూసిన భావోద్వేగం, విజువల్స్ ఈసారి కూడా మరింతగా ఉండబోతున్నాయన్న అంచనాలు ఉన్నాయి. జేక్ సల్లి (సామ్ వర్తింగ్టన్), నెయ్టిరి (జోయ్ సాల్దానా) మళ్లీ పాండోరా ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుండగా, ఈసారి కథలో కీలకంగా నిలిచేది కొత్త తెగ “అష్ పీపుల్”. వారి నాయకురాలిగా ఊనా చాప్లిన్ కనిపించబోతున్నారు. ఆమె పాత్ర వరాంగ్ పై ఇప్పటికే హాలీవుడ్లో కూడా హైప్ పెరిగింది.
డిసెంబర్ 19 రిలీజ్ ఈ చిత్రం ఆరు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.






