Lokesh Kanagaraj: కూలీలో ఆ నెంబర్ వెనుక అసలు రీజన్

రజినీకాంత్(Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kangaraj) దర్శకత్వంల వస్తోన్న సినిమా కూలీ(Coolie). పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా కూలీ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. అందులో భాగంగానే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు.
కూలీ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజైన ఫోటోలో రజినీకాంత్ చేతిలో 1421 అనే కూలీ బ్యాడ్జ్ ఉంటుంది. అయితే ఆ బ్యాడ్జికు పర్టిక్యులర్ గా అదే నెంబర్ పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని లోకేష్ వెల్లడించాడు. తన తండ్రి ఒక బస్ కండక్టర్ అని, ఆయన బ్యాడ్జి నెంబరే 1421 అని, ఆయనకు గౌరవంగానే తాను ఆ నెంబర్ ను రజినీ బ్యాడ్జిగా పెట్టానని తెలిపాడు.
తన తండ్రి కండక్టర్ అనే విషయాన్ని రజినీ సర్ కు చాలా కాలం వరకు చెప్పలేదని, ఎందుకు చెప్పలేదని అడిగితే మీ అంతట మీరు అడిగితే ఆ విషయం మీకు గుర్తుండిపోతుందని చెప్పలేదని చెప్పానని కూడా లోకేష్ వివరించాడు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాపై అందరికీ భారీ అంచాలున్నాయి.