The Raja Saab: ఫైనల్ స్టేజ్ లో రాజా సాబ్ షూటింగ్

మారుతి(maruthi) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ది రాజా సాబ్(the raja saab) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఏ మాత్రం అంచనాల్లేకుండా మొదలైన ఈ సినిమా తర్వాత్తర్వాత భారీ అంచనాలను, క్రేజ్ ను సొంతం ఏర్పరచుకుంది. ఇప్పటికే రాజా సాబ్ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను విపరీతంగా పెంచేశాయి.
ఇదిలా ఉంటే రాజా సాబ్ షూటింగ్ కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ తెలుస్తోంది. రాజా సాబ్ షూటింగ్ ఆఖరి స్టేజ్ లో ఉందని, మరో ఫైట్ సీన్ షూట్ చేస్తే రాజా సాబ్ షూటింగ్ పూర్తవుతుందని, ఆ సీన్ లో ప్రభాస్ నటించే పని లేదని, రాజా సాబ్ కు సంబంధించి మరో వారం రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, అది కూడా అయిపోతే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది.
కాగా రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ కానుంది. అంటే రిలీజ్ కు మరో రెండు నెలల టైముంది. రాజా సాబ్ లాంటి సినిమాకు 2 నెలల టైమ్ ఏమీ ఎక్కువ కాదు. వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్స్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది అనుకోవచ్చు. కానీ రాజాసాబ్ కు సంబంధించిన సీజీ వర్క్స్ కూడా చాల వరకు అయిపోయాయని, చిన్న చిన్న పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. చూస్తుంటే రాజా సాబ్ ఎలాంటి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేకుండా చాలా ఫ్రీ గా సినిమాను రెడీ చేసుకోవచ్చని అర్థమవుతుంది.